Go Ad-Free
If you regularly use Hymnary.org, you might benefit from eliminating ads. Consider buying a Hymnary Pro subscription.
15842 | The Cyber Hymnal#15843 | 15844 |
Text: | నీతిగల యెహొవ |
Tune: | NEETHI GALA YEHOVA |
Media: | MIDI file |
1 నీతిగల యెహొవ స్తుతి మీ - యాత్మతొ నర్పించుడి - మీ యాత్మతో సేవించుడి
దాతయౌ మన క్రీస్తు నీతిని - దాల్చుకొని సేవించుడి || నీతి ||
2 చదలఁ బుడమియు రవియు జలధియు - నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము - సర్వదా నుతిఁజేయను || నీతి ||
సర్వశక్తుని కార్యములకీ - సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు - నుర్విలో నుతిఁజేయను || నీతి ||
3 గీత తాండవ వాద్యములచేఁ - బ్రీతిపరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు - దాతనే సేవించుఁడి || నీతి ||
4 పరమదూతలు నరులు పుడమిని - మొరలు బెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని - పాదములు సేవింతురు || నీతి ||
5 ఇలను భక్తులు గూడుకొనియా - బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్లతోడను - విసుగు జెందక జేయుడి || నీతి ||
6 ఆత్మ నీవిఁక మేలుకొని శు - ద్దాత్మఁ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని - హర్షమున సేవింపవే || నీతి ||
Text Information | |
---|---|
First Line: | నీతిగల యెహొవ స్తుతి మీ - యాత్మతొ నర్పించుడి - మీ యాత్మతో సేవించుడి |
Title: | నీతిగల యెహొవ |
Language: | Telugu |
Copyright: | Public Domain |
Tune Information | |
---|---|
Name: | NEETHI GALA YEHOVA |
Incipit: | 55654 34454 32334 |
Key: | E♭ Major |
Copyright: | Public Domain |
Media | |
---|---|
Adobe Acrobat image: | |
MIDI file: | MIDI |
Noteworthy Composer score: | Noteworthy Composer Score |